భారతదేశం, మార్చి 17 -- ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన సొసైటీలో పనిచేసే ప్లంబర్ ఆదాయం విని నోరెళ్లబెట్టాడు! "ఒక ప్లంబర్ ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు," అంటూ సదరు వ్యక్తి ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ రెడ్డిట్ వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిశాక తన 'జీవిత నిర్ణయాల' (లైఫ్​ ఛాయిసెస్​) గురించి మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అతను అంటున్నాడు

సదరు వ్యక్తి రెడ్డిట్​లో పోస్ట్​ చేసిన వివరాల ప్రకారం.. ముంబైలోని మీరా రోడ్, బోరివలి, కాండివలి వంటి ప్రాంతాల్లోని టౌన్‌షిప్‌లలో ఈ ప్లంబర్ పనిచేస్తుంటాడు. పైపులు రిపేర్ చేస్తున్న సమయంలో మాటల సందర్భంలో తన సంపాదన గురించి వివరించాడు.

"అతను చెబుతున్నది మొదట జోక్ అనుకున్నాను. కానీ అతను లెక్కలతో పాటు చెప్పడం మొదలుపెట్టాక షాక్ అయ్య...