భారతదేశం, జూలై 3 -- రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో కింది కోర్సులను భర్తీ చేయనున్నారు.

ప్రవేశానికి అర్హత ప్రమాణాలు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ లేదా దానికి సమానమైన బోర్డు నుంచి ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ( బైపీసీ ) ఉత్తీర్ణులై ఉండాలి.

తెలంగాణ ఈఏపీసెట్ - 2026 (TS EAPCET-2026) అగ్రికల్చర్ స్ట్ర...