భారతదేశం, నవంబర్ 24 -- Mahatma Jyotiba Phule Biopic Phule In Telugu: సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఈ మహనీయుల జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

ముఖ్యంగా మహిళా విద్యకు మార్గం చూపుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం వారు సాగించిన పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే 'ఫూలే'. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రతీక్ గాంధీ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో, ...