భారతదేశం, సెప్టెంబర్ 1 -- భారతీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' భారీ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే పరిమితమైన యూపీఐ సేవలను, ఇప్పుడు సాధారణ కీప్యాడ్ (ఫీచర్) ఫోన్ ఉపయోగిస్తున్న కోట్ల మంది గ్రామీణ, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఫోన్‌పే యూపీఐ 123పే' పేరుతో ఈ నూతన సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా క్షణాల్లో డిజిటల్ లావాదేవీలు పూర్తి చేయవచ్చు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ లక్షలాది మంది ఇంటర్నెట్ లేని సాధారణ కీప్యాడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. కాగా 2జీ నెట్‌వర్క్ సరిగ్గా లేని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఈ సాంకేతికత డిజిటల్ లావాదేవీల స్వరూపాన్నే మార్చనుంది. దేశవ్యాప్తం...