భారతదేశం, ఏప్రిల్ 8 -- పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్​ఓ 3.0 ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ఈ నూతన వ్యవస్థలో భాగంగా చందాదారులు తమ పీఎఫ్ నిధులను ఏటీఎం కార్డులు లేదా యూపీఐ యాప్‌ల ద్వారా నేరుగా విత్​డ్రా చేసుకోవచ్చు. 2026 మధ్య నాటికి ఇది పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

అయితే ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్​ అమౌంట్​ ఎంత వరకు విత్​డ్రా చేసుకోవచ్చు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విత్​డ్రాయల్ పరిమితులపై ప్రస్తుతానికి వివిధ ప్రతిపాదనలు ఉన్నాయి:

పరిమితి: మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50% నుంచి 75% వరకు విత్​డ్రా చేసుకునే అవకాశం ఉండవచ్చు. గత ఏడాది కేంద్ర కార్మిక శాఖ మంత్రి ...