భారతదేశం, నవంబర్ 6 -- ఉద్యోగస్తులకు భవిష్య నిధి (పీఎఫ్) ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవాలని భావించినప్పుడు ఖాతా వివరాల్లో చిన్న తప్పు ఉన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పేరులో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, జెండర్ లేదా ఉద్యోగంలో చేరిన తేదీల్లో వ్యత్యాసాలు ఉంటే ఈపీఎఫ్‌ఓ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిలిచిపోతుంది లేదా ఆలస్యమవుతుంది. కాబట్టి ప్రతీ ఉద్యోగి కాలానుగుణంగా తమ పీఎఫ్ పాస్‌బుక్, ప్రొఫైల్ వివరాలను సరిచూసుకోవడం ఎంతో అవసరం.

సుమారు 30 కోట్ల మంది సభ్యులకు సంబంధించి దాదాపు రూ. 30 లక్షల కోట్ల రిటైర్మెంట్ పొదుపు నిధులను ఈపీఎఫ్‌ఓ నిర్వహిస్తోంది. ఇక సభ్యుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాల్లో తప్పులను సరిచేసుకోవడానికి ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ జాయింట్ డిక్లరేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి ...