భారతదేశం, మార్చి 7 -- శనివారం, మార్చ్​ 7న భారతీయులకు పొద్దున్నపొద్దునే గట్టి షాక్​ ఎదురైంది! ఇళ్లల్లో వినియోగించే గ్యాస్​ సిలిండర్లతో పాటు కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్​ సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా, ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా ఉద్రిక్తతల నెపథ్యంలో సామాన్యుడిపై 'బాదుడు' మొదలైందని ప్రజల్లో ఆందోళనలు పెరుగుతోంది. సిలిండర్​ రేటు పెంపు తర్వాత ఇప్పుడు అందరి భయం.. పెట్రోల్​, డీజిల్​ ధరలపై పడింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న అనిశ్చి నేపథ్యంలో, చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతాయా? ఈ వార్త ఏ క్షణంలోనైనా వినాల్సి వస్తుందా? అని అందరు ఆవేదన చెందుతున్నారు.

మరి ఈరోజు, మార్చ్​ 7న దేశంలో ఇంధన ధరలు పెరిగాయా?

లేదు. మార్చ్​ 7న పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరగలేదు. అంతర్జాతీయంగా అనిశ్...