భారతదేశం, మే 25 -- Petrol price today : భారతదేశంలో ఇంధన ధరల మంట కొనసాగుతోంది. సోమవారం లీటరు పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71 చొప్పున పెంచాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో నాలుగేళ్ల తర్వాత మొదటిసారి పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటింది. ప్రస్తుతం అక్కడ లీటరు పెట్రోల్ రూ. 102.12, డీజిల్ రూ. 95.20 వద్ద సేల్​ అవుతోంది.

గడిచిన రెండు వారాల లోపే పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. దీనితో మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తంగా పెట్రోల్‌పై రూ. 7.35, డీజిల్‌పై రూ. 7.53 వరకు భారం పడింది. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడమే దేశంలో ఇంధన ధరల పెంపునకు కారణం. అయితే, రానున్న రోజుల్లో ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారతదేశంలో ఇంధన ధరలు అ...