భారతదేశం, నవంబర్ 10 -- ఈపీఎస్​ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) పరిధిలోని సబ్​స్క్రైబర్స్​కు త్వరలోనే శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు ఉన్న రూ. 1000 కనీస పింఛనును రూ. 3వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖతో కార్మికశాఖ ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం.

ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్​ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్​ ట్రస్టీస్ భేటీలో.. కనీస పింఛనును రూ. 3000కు పెంచే అంశాన్ని ప్రత్యేక అజెండాగా చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

2014కి ముందు ఈపీఎఫ్​ఓ వేతన పరిమితిని రూ. 6500గా ఉండేది. దానిని రూ. 15వేలకు పెంచారు. ఆ సమయంలో కనీస పింఛనును కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు దాదాపు 80శాతం పింఛనుదారులకు పెన్షన్ రూ. 1000 లోపే ఉండేది. అనంతరం దానిని రూ. 1000కి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప...