భారతదేశం, అక్టోబర్ 10 -- Ram Charan Peddi Worldwide TV Premiere: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం 'పెద్ది'. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు బుల్లితెరపై అలరించేందుకు సిద్ధమైంది.

'ఉప్పెన' వంటి సంచలన విజయంతో టాలీవుడ్‌లో తనదైన మార్క్ వేసుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సాన పెద్ది చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది.

క్రీడలు, గ్రామీణ నేపథ్యం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు కలబోసిన కథాంశంతో రూపుదిద్దుకున్న 'పెద్ది'.. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆత్మవిశ్వాసంతో గెలుపు తీరాలకు చేరే ఓ సామాన్య యువకుడి ఆవేశం, ఆరాటాన్ని చూపిస్తుంది.

ప...