భారతదేశం, మే 18 -- Peddi Trailer: రామ్ చరణ్ పెద్ది మూవీ ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఓ క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆటే నా పొగరు అంటూ ఎంట్రీ ఇచ్చిన అతడు.. ట్రైలర్ మొత్తం అదరగొట్టాడు.

పెద్ది ట్రైలర్ సోమవారం (మే 18) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. అభిమానుల అంచనాలకు తగినట్లుగానే ఈ ట్రైలర్ సాగింది. ఇప్పటి వరకూ ఈ మూవీలో చరణ్ కు సంబంధించి క్రికెటర్, రెజ్లర్ లుక్స్ రిలీజ్ కాగా.. తాజా ట్రైలర్ లో అతన్ని ఓ రన్నర్ గానూ చూపించారు.

ఇక చరణ్ తోపాటు ఈ ట్రైలర్ లో జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్‌కుమార్, విలన్ గా వస్తున్న దివ్యేందు శర్మ పాత్రలను కూడా చూపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు ఎమోషనల్ గానూ...