భారతదేశం, జూన్ 22 -- Peddi OTT Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్లలో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది.

ఇప్పటికే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటి, రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ఒక పక్క థియేటర్లలో రన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండగానే.. మరోపక్క ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'పెద్ది' సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ...