భారతదేశం, జూన్ 10 -- Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తన గ్లోబల్ రేంజ్ పవర్‌ను మరోసారి నిరూపించారు. 'రంగస్థలం' సినిమాతో సోలోగా నాన్-పాన్ ఇండియా కేటగిరీలో సరికొత్త చరిత్ర సృష్టించిన మెగా పవర్‌స్టార్, ఇప్పుడు 'పెద్ది' (Peddi) చిత్రంతో థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజేతగా నిలిచింది.

పెద్ది చిత్రం విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.332.1 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను లిఖించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ కలెక్షన్ల వేటతో రామ్ చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్...