భారతదేశం, జూన్ 5 -- Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల రికార్డుల దుమ్ము దులుపుతోంది. ఫస్ట్ డేనే రూ.135 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ రవి శంకర్ సంచలన కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

''బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది'' అనే పేరుతో పెద్ది మేకర్స్ శుక్రవారం (జూన్ 5) ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు సాన, ప్రొడ్యూసర్లు రవి శంకర్, వెంకట కిలారు, డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రవి శంకర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.

''ఇన్నాళ్లు ఎదురు చూసిన పెద్ది రానే వచ్చింది. మనం అనుకుంటున్న సైక్లోన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ తో కలిసి హైయ్యస్ట్ రికార్డు క్రియేట్ ...