భారతదేశం, మే 24 -- Peddi: తెలుగు సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకునే ఒక అరుదైన ఫొటో కొలాజ్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకప్పటి బ్లాక్‌బస్టర్ వింటేజ్ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి, లోకనాయకుడు కమల్ హాసన్‌తో కలిసి ఉన్న పాత ఫొటో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

సినిమా చరిత్రలో నిలిచిపోయే ముగ్గురు లెజెండరీ నటీనటులు శ్రీదేవి, చిరంజీవి, కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ క్లాసిక్ పిక్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వింటేజ్ ఫొటోకు సరిగ్గా సరిపోయేలా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన సరికొత్త చిత్రం 'పెద్ది' (Peddi) నుంచి వచ్చిన ఒక లేటెస్ట్ ఫొటోను జత చేస్తూ అభిమానులు షేర్ చేస్తున్నారు.

పెద్ది మూవీ నుంచి తాజాగా హెల్లాల్లల్లో అనే స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇం...