భారతదేశం, జూన్ 8 -- Peddi: రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది' (Peddi) టీమ్ సోమవారం (జూన్ 8) సాయంత్రం హైదరాబాద్‌లో 'థ్యాంక్స్ మీట్' నిర్వహించింది. ఫస్ట్ వీకెండ్‌లో సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దానిపై ఈ మీట్‌లో చర్చించారు. వృద్ధి సినిమాస్ ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు.. హిందీ బాక్సాఫీస్ దగ్గర సినిమా వీక్ గా పెర్ఫార్మ్ చేయడం గురించి ఓపెన్ గా మాట్లాడారు. ఫైనల్ గా ఆదివారం నాడు మాత్రమే అక్కడ కలెక్షన్స్ పుంజుకున్నాయని అంగీకరించారు.

పెద్ది సినిమాకు అత్యధిక కలెక్షన్స్ తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్ కు థ్యాంక్స్ చెబుతూ ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు తన స్పీచ్ స్టార్ట్ చేశారు. "తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో మాటలు రావడం లేదు. సోమవారం నాడు సినిమా ...