భారతదేశం, మే 14 -- Peddi: సినీ అభిమానుల గుండెల్లో బలమైన ముద్ర వేయడానికి 'పెద్ది' (PEDDI) చిత్రం సిద్ధమైంది. కేవలం సినిమాగానే కాకుండా, ప్రేక్షకులను కుదిపేసే ఒక తుపానులా, గుండెకు హత్తుకునే కథలా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. సినిమా పై ఉన్న అంచనాలను నిజం చేస్తూ, చిత్ర బృందం ప్రమోషన్ల విషయంలో దూకుడు పెంచింది.

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాను జనాలకు చేరువ చేసేందుకు మూవీ టీమ్ భారీ ప్లాన్ వేసింది. భారీ కలలను సాకారం చేసుకునే క్రమంలో బాధ్యత కూడా అంతే ఉంటుందని భావించి, 'పెద్ది పవర్‌ప్లే టూర్' (PEDDI POWERPLAY TOUR) పేరిట భారీ దేశవ్యాప్త పర్యటనకు మూవీ టీమ్ శ్రీకారం చుట్టనుంది.

మే 18 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రమోషనల్ టూర్ దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయనుంది. ముంబైలో మొదలై హైదరాబాద్ వరకు సాగే ఈ పర్యటనలో చిత్ర యూనిట్ ప్రేక్షకులతో నేరుగా మ...