భారతదేశం, మే 16 -- Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. మే 18న ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుండగా, తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సినిమా క్లైమాక్స్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. 'పెద్ది' చిత్రంలో ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉండబోతోందని, అది క్లైమాక్స్‌ను ఊహించని మలుపు తిప్పుతుందని వెల్లడించారు.

రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ హీరోతో అలాంటి ఎమోషనల్ క్లైమాక్స్‌ను ప్లాన్ చేయడం చాలా రిస్కీ మూవ్ (సాహసోపేతమైన నిర్ణయం) అని ఆయన అభిప్రాయపడ్డారు.

"సినిమాలో ఆ సెగ్మెంట్ వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులకు 'పెద్దిగాడ...