భారతదేశం, మే 26 -- Peddi: టాలీవుడ్ లెజెండరీ నటుడు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరికీ అందనంత వేగంతో దూసుకుపోతున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషిస్తున్న వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఆయన నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). ఈ సినిమాలో ఆయన 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

పాత్ర కోసం జగపతి బాబు పడే తపన అంతా ఇంతా కాదు. దర్శకుడు అడిగిందే తడవుగా తన గెటప్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మార్చేసుకుంటారు జగ్గూభాయ్. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో కూడా అదే జరగబోతోంది. జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధి...