భారతదేశం, మే 23 -- Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'కి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా, టాలీవుడ్‌లో సరికొత్త థియేట్రికల్ వివాదం రాజుకుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ సబ్ కమిటీ నుంచి ఈ సినిమాకు ఎదురైన అడ్డంకులు తొలిగిపోయాయని భావిస్తున్న తరుణంలో, తాజాగా థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) తీసుకున్న నిర్ణయం చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్‌గా మారింది.

పెద్ది సినిమా విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో మెగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం (మే 23) అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. 'పెద్ది' సినిమాకు ఎలాంటి టికెట్ ధరల పెంపును అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు టికెట్ల ధరల పెంపును పూర్తిగా వ్యతిరేకిస...