భారతదేశం, ఏప్రిల్ 16 -- PEDDI: మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో 'పెద్ది' ఒకటి. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం మరోసారి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తూ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. ఈ వాయిదాకు కారణాన్ని మాత్రం ప్రకటించలేదు. బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నామని మాత్రమే పేర్కొన్నారు.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ అనేది బేతాళ ప్రశ్నగా మారిందనే ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ మార్చి 27న రిలీజ్ అవుతుందని ఫస్ట్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడేమో మళ్లీ జూన్ లో మూవీ వస్తుందని అనౌన్స్ చేశారు.

పెద్ది మూవీ జూన్, 2026లో రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ఇందుకు కొన్ని కారణా...