భారతదేశం, ఏప్రిల్ 28 -- Payal Rajput: ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో ఎమోషనల్ అయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. క్యాన్సర్ తో కన్నుమూసిన తన తండ్రిని తలచుకొని ఆమె ఏడ్చిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఫస్ట్ టైమ్' (First Time 01.01.01) సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం (ఏప్రిల్ 28) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న పాయల్‌ను తీవ్రంగా కలచివేసింది. గత కొంతకాలంగా తను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను, తన కుటుంబం పడిన కష్టాన్ని తలుచుకుని ఆమె వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు.

తమ కుటుంబం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి పాయల్ మాట్లాడుతూ.. "మా నాన్న క్యాన్సర్ బార...