భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్‌ ఛాంబర్‌లో కలిశారు. హిందూపురం నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలప ఆయనతో చర్చించారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గతేడాది సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలాల్లో బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి . సినిమా టికెట్ల పెంపు విషయంలో చిరంజీవి వ్యవహారశైలిని ఎత్తి చూపేలా మాట్లాడారు. సినిమా టికెట్ల ధరల పెంపు కోసం జగన్ ప్రభుత్వంతో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. చిరంజీవిని పరోక్షంగా విమర్శిస్తూనే..ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (FDC) స...