భారతదేశం, మే 2 -- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యం పట్ల ఆందోళనతో ఉన్న ఫ్యాన్స్ కు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. సర్జరీ తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి బయట కనిపించారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కు ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయన్ని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ ఇంటికి వెళ్లారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం (మే 2) ఆయన ఇంటికి వెళ్లారు. ఇటీవల పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి పవన్ ఇంట్లో ఉండి కోలుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలిశారు. ఇవాళ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భ...