భారతదేశం, జూన్ 14 -- Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' వంటి క్రేజీ ప్రాజెక్టు అప్ డేట్ తో మెగా అభిమానులు ఇప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, తాజాగా ఆయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఇప్పుడు సినీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టెలివిజన్ ప్రీమియర్ ఇవాళ (జూన్ 14) రాత్రే గ్రాండ్‌గా జరగనుంది. ​అయితే ఈ టెలివిజన్ డెబ్యూ వెనుక ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంది. ఒరిజినల్ తెలుగు కంటే ముందే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో బుల్లితెరపై సందడి చేయబోతోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' హిందీ వెర్షన్ ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రముఖ జాతీయ ట...