భారతదేశం, ఏప్రిల్ 4 -- మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సుమారు దశాబ్ద కాలం తర్వాత పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం 'పేట్రియాట్'. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. దేశ భద్రత, అత్యాధునిక టెక్నాలజీ, స్నేహం నేపథ్యంలో సాగే ఈ కథలో ఇద్దరు దిగ్గజాలు పోటాపోటీగా నటించినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

లెజెండరీ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి నటిస్తున్న సినిమా 'పేట్రియాట్'. శనివారం (ఏప్రిల్ 4) ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో మమ్ముట్టి ఒక రిటైర్డ్ జేఏజీ (JAG) ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దేశ రహస్యాలను సేకరించే సామర్థ్యం ఉన్న ఒక శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ గురించి ప్రపంచానికి తెలియజేసే వ్లాగర్‌గా ఆయన పాత్రను మలిచారు. అయితే, ఆయనపై గూఢచారి అనే ముద్ర వేసి తప్పుడు...