భారతదేశం, జూలై 8 -- Parvathy: సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా సర్కిల్స్‌లో ఎప్పుడు ఏ వివాదం జరిగినా తనదైన శైలిలో గొంతు వినిపించే నటి పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu). రీసెంట్‌గా మలయాళ స్టార్ హీరోల ప్రవర్తన, పరిశ్రమలో మహిళల భద్రతపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

పార్వతి తిరువోతు తాజాగా 'ఐ నోబడీ' మూవీలో నటించింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ హీరో. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పార్వతి ఘాటు కామెంట్లు చేసింది. మాలీవుడ్‌లో ఏళ్ల తరబడి సాగుతున్న పవర్ పాలిటిక్స్, అసోసియేషన్ల ముసుగును డీకోడ్ చేస్తూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మలయాళ పరిశ్రమను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు (సూపర్ స్టార్స్) మౌనంగా ఉండటాన్ని పార్వతి తీవ్రంగ...