భారతదేశం, ఆగస్టు 5 -- Part Timers OTT: తెలుగు బుల్లితెరపై 'ముద్ద మందారం' (Mudda Mandaram) సీరియల్‌లోని పార్వతి పాత్రతో సుమారు 1500 ఎపిసోడ్ల పాటు వీక్షకులను అలరించిన నటి తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy) ఓటీటీలో అడుగుపెడుతోంది. డిజిటల్ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆమె కీలక పాత్ర పోషించిన 'పార్ట్ టైమర్స్' వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది.

బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 9లో తన నిజాయితీగల ప్రవర్తనతో రన్నరప్‌గా నిలిచి విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న తనూజ.. నేరుగా ఓటీటీ ప్రైమ్‌టైమ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) నిర్మించిన సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ 'పార్ట్ టైమర్స్' (#PartTimers) లో తనూజ ఓ హీరోయిన్.

జియోహాట్‌స్టార్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లు, ప్రమోషనల్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సిర...