భారతదేశం, నవంబర్ 12 -- Paradox Harikatha: ఐరావత సినీ కలర్స్, అగ్మైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కడ్లూరి అశోక్, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న సినిమా 'పారడాక్స్ హరికథ'. రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

చిత్ర విడుదల తేదీని డిసెంబర్ 11గా అధికారికంగా ప్రకటిస్తూ, చిత్రబృందం 'గుప్పెడంత ప్రేమ' అనే ఓ మంచి రొమాంటిక్ పాటను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మహావీర్ మాట్లాడుతూ.. తనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనుదీప్ పడిన కష్టం, అంకితభావం ఈ సినిమాను తప్పకుండా మంచి విజయం వైపు నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సాంగ్ రిలీజ్ వేడుకలో మూవీ టీమ్ మాట్లాడింది. నటి అఖిల రామ్ మాట్లాడుతూ.. "'పారడాక్స్ హరికథ' సినిమా చాలా అద్భుత...