భారతదేశం, ఏప్రిల్ 12 -- Papam Pratap Trailer: 'మసూద', 'మంగళవారం' వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన మూవీ 'పాపం ప్రతాప్' (Papam Prathap). 1998 నాటి గోదావరి తీరప్రాంత పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మూవీ తాలూకు ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఒక సామాన్య మధ్యతరగతి యువకుడి పెళ్లి జీవితంలో ఎదురైన ఊహించని మలుపులను ఈ ట్రైలర్లో వినోదాత్మకంగా, ఎమోషనల్గా చూపించారు.
ప్రతాప్ (తిరువీర్) తన వివాహ బంధం గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అయితే అతని తండ్రి (అజయ్ ఘోష్) మాత్రం పెళ్లి విషయంలో మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉంటాడు. చివరకు ప్రతాప్ తండ్రి భయపడినట్టే జరుగుతుంది. పెళ్లైన కేవలం నాలుగు రోజులకే భార్య (పాయల్ రాధాకృష్ణ) అత్తగారి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.
దీంతో ప్రతాప్ పరిస్థితి అగమ్యగోచరం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.