భారతదేశం, మే 9 -- Panchali Pancha Bhartruka Movie Song Released: కామెడీ సినిమాలకు ఎప్పటికి ఆదరణ ఉంటుంది . టైటిల్‌లోనే వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ కథాంశంతో విడుదలకు సిద్ధమైన సినిమా "పాంచాలి పంచభర్తృక ". ఈ మూవీలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. హీరోగా తెలుగు రాప్ సింగర్ రోల్ రైడా పరిచయం కానున్నాడు.

రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్ , ఓం సాయిరాం ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాంచాలి పంచభర్తృక సినిమాకు రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్రెండీ కామెడీతో తెరకెక్కించిన ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు.

ప్రమోషన్స్‌లో భాగంగా పాంచాలి పంచ భర్తృక సినిమాలోని "సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట" అనే రెట్రో స్టైల్‌లో ఉన్న పాటను ఇటీవల విడుదల చేసారు. ఈ...