భారతదేశం, ఆగస్టు 7 -- Pallaburusu Trailer: అక్కినేని నాగార్జునకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'అన్నపూర్ణ స్టూడియోస్' సమర్పణలో తెరకెక్కిన రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పళ్లబురుసు' థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఒక పళ్లబురుసు (టూత్‌బ్రష్) చుట్టూ తిరిగే తండ్రీకొడుకుల విచిత్రమైన డ్రామా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.

పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పళ్లబురుసు మూవీ కథలో 68 ఏళ్ల వృద్ధుడు తన కొడుకుని పళ్లబురుసు కొనివ్వమని పదే పదే అడుగుతాడు. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయిన కొడుకు ఆ చిన్న కోరికను పట్టించుకోకపోవడంతో, తండ్రి ఏకంగా కోర్టు మెట్లు ఎక్కి కొడుకుపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతాడు.

పోలీసులు, జడ్జ...