భారతదేశం, జూలై 29 -- Pallaburusu Teaser: ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న విలేజ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'పళ్లబురుసు' టీజర్ అఫీషియల్‌గా విడుదలైంది. సుధాకర్ రెడ్డి, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిన్న బడ్జెట్ సినిమా టీజర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ రైడ్‌లా సాగుతూ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు టీజర్‌తో ప్రమోషన్ల డోస్ మరింత పెంచేసింది.

ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకొడుకుల మధ్య సాగే డిఫరెంట్ అండ్ ఫన్నీ కథతో ఈ సినిమాను డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తెరకెక్కించారు. నాన్న తన కొడుకుని ఒక పళ్లబురుసు (టూత్‌బ్రష్) కొనివ్వమని పదే పదే అడుగుతుంటాడు. కానీ కొడుకు మాత్రం తన సొంత ఆర్థిక సమస్యలత...