భారతదేశం, సెప్టెంబర్ 2 -- Pallaburusu OTT: తెలుగు ఓటీటీ లవర్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చేసింది. ఎవరూ ఊహించని విధంగా లేటెస్ట్ తెలుగు మూవీ 'పళ్లబురుసు' ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోపే మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అక్కినేని నాగార్జున మెచ్చిన ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వైరల్ గా మారింది.

ఇటీవల తెలుగు సినిమాల్లో రూటెడ్ స్టోరీస్ కు జనాలు జై కొడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ పల్లెల్లోని జీవితాలు, అనుబంధాలు, సహజ కథలు వెండితెరపై వెలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి రూటెడ్ స్టోరీతో వచ్చిన సినిమానే 'పళ్లబురుసు'. టూత్ బ్రష్ ను తెలంగాణలో పళ్లబురుసు అని పిలుస్తారు.

పళ్లబురుసు సినిమాకు ఇంత పాపులారిటీ రావడం వెనుక ప్రధాన కారణం ఉంది. అక్కినేని నాగార్జునకు ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది. అందుకే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమాను...