భారతదేశం, మార్చి 28 -- దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, సరిహద్దు అవతల మాత్రం ఈ రెండు సినిమాలపై భిన్నమైన చర్చ నడుస్తోంది.

రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. పాకిస్థాన్‌లోని కరాచీ, ల్యారీ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. అయితే, ఈ సినిమాలో చూపించిన ల్యారీ గ్యాంగ్ వార్స్, అక్కడి సంస్కృతి వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని కొందరు పాకిస్థానీయులు పెదవి విరుస్తున్నారు.

రోహన్ భట్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బాలిలో కలిసిన కొందరు పాకిస్థానీయులతో ఈ సినిమా గురించి చర్చించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

"ధురంధర్ సినిమాకు అనవసరమైన హైప్ ఇచ్చారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. 'ఎవరు ల్యారీని శా...