భారతదేశం, ఫిబ్రవరి 27 -- పాకిస్థాన్- ఆఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల సరిహద్దు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మా సహనం నశించింది. ఇక మాకు, మీకు మధ్య బహిరంగ యుద్ధం మొదలైంది," అని ఆయన స్పష్టం చేశారు.
ఆఫ్గాన్ దళాలు తమ సరిహద్దు దళాలపై దాడి చేశాయని ఆరోపిస్తూ, పాకిస్థాన్ సైన్యం శుక్రవారం భారీ వైమానిక దాడులకు దిగింది. ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌తో పాటు కాందహార్, పక్తియా ప్రాంతాల్లోని తాలిబన్ రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.