భారతదేశం, జూలై 13 -- P Susheela Janaki: ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో లెజెండరీగా ఎదిగిన ఎస్.జానకి ఇప్పుడు మన మధ్యలో లేరు. శనివారం (జూలై 11) ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కన్నుమూశారనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ సింగర్ పి.సుశీల ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

జానకమ్మ మరణంపై పి.సుశీల ఎమోషనల్ అయ్యారు. జానకి గురించి సుశీలమ్మ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

''ఏం చెప్పాలమ్మా. మద్రాస్ లో రెండు పర్వతాలం మేం. ఆవిడ (జానకి) గడగడలాడించింది. దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడను తీసుకెళ్లి పోయాడు దేవుడు. ఇప్పుడు మ్యూజిక్కే లేదు. ఆ పిల్ల ఎన్ని రకాలుగా పాడుతుందో ఎవరూ ఊహించలేదు. అందుకే ఆవిడకు నా పేరు మీద ఫస్ట్ అవార్డు ఇచ్చాం. నా జీవితంలో నేను చేసిన మంచి పని అదే'' అని స...