భారతదేశం, మే 22 -- Osmania University PhD Notification 2026 : ప్రఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) లో పరిశోధన చేయాలనుకునే అభ్యర్థులకు ఓయూ అడ్మిషన్ల విభాగం కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 విద్యాసంవత్సరానికి గాను వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 (Category-I) కింద పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై, జేఆర్‌ఎఫ్ సాధించిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూల ద్వారా పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా. ఇటీవలనే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఓయూ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కేటగిరీ-1 పీహెచ్‌డీ నోటిఫికేషన్‌కు దరఖాస్...