భారతదేశం, అక్టోబర్ 22 -- OTT Web Series: తెలుగు డిజిటల్ స్క్రీన్‌పై ఇవాళ సరికొత్త సంచలనం మొదలైంది. ఊహకు అందని సస్పెన్స్, కళ్లు బైర్లు కమ్మే సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో రెండు సరికొత్త తెలుగు వెబ్ సిరీస్‌లు 'వరం' (Varam), 'నా వైఫ్ మిస్సింగ్' (Na Wife Missing) అక్టోబర్ 22న డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి. థ్రిల్లర్ లవర్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించే ఈ రెండు సిరీస్‌ల పూర్తి వివరాలు, కథలు, విశేషాలు మీకోసం!

మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణంలో, ఆదిత్య మండల దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన సూపర్ నేచురల్ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ 'వరం'. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌ (JioHotstar) లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్, శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్ వినీత్, జైయిత్రి మకానా, శివాజీ...