భారతదేశం, జూన్ 14 -- OTT Trending: వెండితెరపై కంటే కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలపైకి వచ్చాక విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి ఒక సినిమానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై దుమ్ములేపుతోంది. ఆ మూవీనే.. యంగ్ హీరో నందు విజయ్ కృష్ణ, టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్ లీడ్ రోల్స్ పోషించిన సైకలాజికల్ రోమాంటిక్ థ్రిల్లర్ మూవీ 'అగ్లీ స్టోరీ' (Ugly Story).

ప్రస్తుతం డిజిటల్ వీక్షకులను అగ్లీ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏకంగా మూడు ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఆహా వీడియో (Aha Video), జియోహాట్‌స్టార్ (JioHotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఆహాలో, జియోహాట్‌స్టార్ లో ఈ మూవీ తెలుగులో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.

ప్రాణస్వరూప్ రచన, దర్శకత్వంలో తెరకె...