భారతదేశం, జూలై 13 -- OTT Trending: తమిళ పరిశ్రమలో ఈ ఏడాది సరికొత్త సంచలనం సృష్టించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్' (Blast) ఇప్పుడు ఓటీటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపుతోంది. సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బ్లాస్ట్ మూవీ ఓటీటీలోనూ బ్లాస్ట్ చేస్తోంది. ఇంగ్లీషేతర (Non-English) చిత్రాల విభాగంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీలోని యాక్షన్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అందుకే ఎగబడి మరీ చూస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ బ్లాస్ట్ సినిమాను జూన్ 25 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెచ్చింది....