భారతదేశం, ఆగస్టు 9 -- OTT Trending: గతంలో 'ఎల వీజ పూంచిర' అనే బ్లాక్‌బస్టర్ చిత్రానికి రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ ఆఫీసర్ షాజీ మారడ్ అందించిన కథతో, ప్రముఖ దర్శకుడు ఎమ్. పద్మకుమార్ తెరకెక్కించిన అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా 'ఉయిర్'. ఈ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు ఆడియన్స్ ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కిన 'ఉయిర్' సినిమా ఓటీటీని షేక్ చేస్తోంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులోనూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.

కేరళలోని ధర్మడం/కణ్ణూర్ పరిసర ప్రాంతాల్లోని ఒక పాడుబడిన బావిలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభిస్తుంది. లోకల్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా చేరిన ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్ అజీబ్ రెహమాన్ (రోషన్ మ్యాథ్యూ) ఈ కేసు బాధ్యతలను త...