భారతదేశం, మార్చి 17 -- థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా దూసుకెళ్తోంది. బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపని ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఎగబడి చూసేస్తున్నారు. ఆ తెలుగు సినిమానే.. 'భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి'. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో బొక్కబోర్లా పడ్డ సంగతి తెలిసిందే.

రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ 'భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి'. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. మిక్స్ డ్ టాక్ వచ్చిన ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 13 నుంచి జీ5 తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది.

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్ల...