భారతదేశం, మే 10 -- Raakaasa OTT Trending On Top 7 Place: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించి, ప్రొడ్యూసర్‌గా మంచి హిట్ అందుకున్న సినిమా రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై రాకాస సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.

అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.2 రేటింగ్ కూడా సంపాదించుకుంది రాకాస. అలాంటి రాకాస ఓటీటీలోని దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ గ్లోబల్ చార్ట్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రాకాస మూవీ.

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి రాకాస చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ఓటీటీ ట్రెండ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ...