భారతదేశం, సెప్టెంబర్ 20 -- OTT Trending: బ్లాక్ బస్టర్ మూవీ ఇరుముడి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు ఓటీటీలోనూ, అటు థియేటర్లలోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన ఇరుముడి సినిమా.. థియేటర్లకూ జనాలను రప్పిస్తోంది.

థియేటర్లలో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ ఇద్దరి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన 'ఇరుముడి' ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 18) ఈ చిత్రం ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇరుముడి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడీ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేసుకు దూసుకెళ్లింది.

ఓటీటీలో ఇరుముడి హవా మామూలుగా లేదు. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే ఇరుముడి ఇండియాలో నంబర్ వన్ మూవీగా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది...