భారతదేశం, ఏప్రిల్ 23 -- OTT Trending: వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో, క్షణక్షణం ఉత్కంఠ రేపే కథనంతో ఓటీటీ ఆడియన్స్ ను మలయాళం మిస్టరీ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' అలరిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఏకంగా మూడు భాషల్లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 'సంభవం అధ్యాయం ఒన్ను' ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 15న ఓటీటీలో అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

జియోహాట్‌స్టార్ లో ప్రస్తుతం 'సంభవం అధ్యాయం ఒన్ను' మూవీ మూడు భాషల్లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. మలయాళంతో పాటు కన్నడ, తెలుగులో నంబర్ వన్ మూవీగా ఈ థ్రిల్లర్ దూసుకెళ్తోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మలయాళ థ్రిల్లర్ ను ...