భారతదేశం, జూలై 19 -- OTT Trending: థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించి, సరికొత్త రికార్డులు సృష్టించింది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా ఈ మూవీ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. సౌత్ ఇండియాలోనే ట్రెండింగ్ నంబర్ వన్ గా ఓటీటీని షేక్ చేస్తోంది.

సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం థియేటర్లలో అదరగొట్టింది. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. థియేటర్లో అదిరే పర్ఫార్మెన్స్ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. ఈ సినిమా జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం సినిమా డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చిన కొన్ని గంటల్లోనే...