భారతదేశం, అక్టోబర్ 6 -- OTT Trending: సౌత్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటనతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్నదమ్ములు సూర్య, కార్తీలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన వీరి లేటెస్ట్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అటు అన్న సూర్య, ఇటు తమ్ముడు కార్తీ ఇద్దరూ ఒకేసారి వేర్వేరు ప్రముఖ ఓటీటీ వేదికలపై నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, మమితా బైజు హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా "విశ్వనాథ్ అండ్ సన్స్". థియేటర్లలో భారీ విజయాన్ని సాధించి, ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లతో సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ప్రము...