భారతదేశం, అక్టోబర్ 23 -- OTT Today Thrillers: థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఓటీటీలోకి ఈ ఒక్క రోజే ఆరు క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో మలయాళ కామెడీ థ్రిల్లర్, హిందీ క్రైమ్ థ్రిల్లర్ నుంచి కన్నడ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వరకు ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ, ఎలా చూడాలో తెలుసుకోండి.

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్ కూడా)

విడుదల తేదీ: అక్టోబర్ 23

ఇదో మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ. సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా నటించిన ఈ టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి తెలుగులోనూ వస్తోంది. తన పెళ్లి రోజే దారుణంగా హత్యకు గురయ్యే కుట్టన్ అనే వ్యక్తి.. మళ్లీ మళ్లీ అదే రోజుకు తిరిగి వస్తుంటాడు. పెళ్లి జరిగినా శోభనం మాత్రం జరగదు. తను బతకడానికి, తన భార్యను కాపాడుకోవడానికి అతడు ...