భారతదేశం, ఆగస్టు 30 -- OTT Today: ప్రతి ఆదివారం ఓ చిన్న సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్. కథా సుధ వీక్లీ సిరీస్ లో భాగంగా ఇవాళ (ఆగస్టు 30) 'నందిని' మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేయండి.

పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఒరిజినల్ సిరీస్ లు, సినిమాలతో సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటోంది. అదే క్రమంలో కథాసుధ సిరీస్ లో ప్రతి సండే ఓ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తోంది.

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కథాసుధ వీక్లీ సిరీస్ లో భాగంగా 'నందిని' మూవీ ఇవాళ డైరెక్ట్ గా డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పకుడిగా...